ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ఓ ప్రియ, జోహారులు
ప్రేమ లేదని ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నెడు చాటనీ
ఓ ప్రియా, జోహారులు
మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైన కన్నీరుందనీ
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ఉసురు కప్పి మూగబోయి నీవుంటివీ
ఉసురు కప్పి మూగబోయి నీవుంటివీ
మోడుబారి నీడ తొడు లేకుంటినీ
ప్రేమ లేదని లాల లాలలా లల లాల లాలలా
గురుతు చెరిపివేసీ జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రి వాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రొదించనీ
ప్రేమ లేదని, ప్రేమించరాదనీ
ప్రేమ లేదని, ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ