Tuesday, July 29, 2008

రాగాలా పల్లకిలో - శుభలేఖ

రాగాలా పల్లకిలో కోయిలమ్మ రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
నా ఉద్యోగం పోయిందండి!!! ...
తెలుసు... అందుకే రాలేదు ఈ వేళా కోయిలమ్మా
రాగాలే మూగబోయినందుకమ్మా

రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా

రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ

బహుశా ఆది తెలుసో ఏమో బహుశా ఆది తెలుసో ఏమో
జాణ కోయిలా రాలెదూ ఈ తొటకి ఈ వేళా

రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా అందుకేనా.. అందుకేనా

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ
బహుశా తను ఎందుకనేమో.. బహుశా తాను ఎందుకనేమో
గడుసు కోయిలా .. రాలేదు ఈ తొటకీ ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా.. రానేలా నీవుంటే కూనలమ్మ..
రాగాలా పల్లకిలో కోయిలమ్మ.. రానేలా నీవుంటే కూనలమ్మ..

No comments: