Tuesday, August 19, 2008

ఏ చోట ఉన్నా - నువ్వే నువ్వే

చోట ఉన్నా (ఉన్నా), నీ వెంట లెనా(లెనా)?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే

రేపులేని చూపు నేనై, శ్వాసలేనీ ఆశ నేనై మిగలనా, ..!
నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతీ క్షణం నా మౌనం!!

చోట ఉన్నా, నీ వెంట లెనా?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే

నేల వైపు చూసీ నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ?
గాలి వెంట వెళ్లే మారం మానుకొమ్మనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వునీ?
ఏమంత పాపం ప్రెమా ప్రేమించడం?
ఇకనైనా చాలించమ్మా వేధించడం!
చెలిమై కురిసే సిరి వెన్నెలవా క్షణమై కరిగే కలవా, ..!

నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతి క్షణం నా మౌనం!!
రేపులేని చూపు నేనై, శ్వాసలేనీ ఆశ నేనై మిగలనా, ..!

వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరెదెలా?
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా?
నాక్కూడ చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ జన్మలో?
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వేలుగై రావా, !
నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతి క్షణం నా మౌనం!!

చోట ఉన్నా, నీ వెంట లెనా?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే!

Watch the song here!

Monday, August 18, 2008

దేశం మనదే! (వందేమాతరం) - జై

దేశం మనదే! తేజం మనదే!
దేశం మనదే, తేజం మనదే,
ఎగురుతున్న జెండా మనదే!!
నీతీ మనదే, జా
తీ మనదే
ప్రజల అండ దండా మనదే!!

అందాల బంధం ఉంది నేలలో
ఆత్మీయ రాగం ఉంది గాలిలో
కులమైనా , మతమైనా
కులమైనా , మతమైనా
భరతమాతకొకటే లేరా!

ఎన్ని బెధాలున్నా
మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం
అంతా వేళా!!

వందేమాతరం! అందాం అందరం!
వందేమాతరం! అందాం అందరం!

దేశం మనదే, తేజం మనదే,
ఎగురుతున్న జెండా మనదే!
నీతీ మనదే, జా
తీ మనదే
ప్రజల అండ దండా మనదే!

అందాల బంధం ఉంది నేలలో
ఆత్మీయ రాగం ఉంది గాలిలో
కులమైనా , మతమైనా
భరతమాతకొకటే లేరా!
రాజులు ఐనా బీదలు ఐనా
భారత మాత సుతులే లేరా!!

న్ని ద్వేషాలున్నా
మా
కెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా వేళా!!

వందేమాతరం! అందాం అందరం!
వందేమాతరం! అందాం అందరం!

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం!
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం !! ...

Listen to the song here (Vandemataram)

Thursday, August 14, 2008

ఎవరో ఒకరు - అంకురం

ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ !

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

కదలరు ఎవ్వరూ వేకువ వొచ్చినా
అనుకోని కోడి కూత నిదరపోదుగా!
జగతికి మేలుకొల్పు మానుకోదుగా!!
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే,
మబ్బు పొంగు చాటుగా వొదిగి దాగితే
వాన ధార
రాదుగా నెల దారికీ,
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ !!

ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ!
దానికి లెక్క లేదు కాళరాతిరీ!
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని!
రెప్ప వెనక ఆపనీ కంటి నీటినీ !
సాగలేక ఆగితే దారి తరుగు
నా?
జాలి చూపి తీరమే
దరికి చేరునా?

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా!
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా!
ఎంత వేడి ఎండతో వొళ్ళు మండితే
అంత వాడి అవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళు మూయడా?
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా?

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!!

Listen to the song here!

Wednesday, August 13, 2008

కొంత కాలం కిందట - నీ స్నేహం

కొంత కాలం కిందట
బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం!
రూపురేఖలు వేరట
ఊపిరొకటే చాలట
ఆ వారాన్నే స్నేహమంటున్నాం మనం!
కంటిపాపని కాపుకాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేనూ నీడ నివ్వాలీ!
స్నేహమంటే రూపులేనీ ఉహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలీ!

కొంత కాలం కిందట
బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం!

బొమ్మ బొరుసు లేని నాణానికి విలువుంటుందా ?
మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా ?
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా ?
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా?
గలగలమని సిరిమువ్వగా
కలతెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మాధురిమలై పాడాలీ ని స్నేహం!

కొంత కాలం కిందట
బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం!

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువు నలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం!
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కలనిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం!
గెలుపుని తరిమే ఆటగా
నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం!

కొంత కాలం కిందట
బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం!
రూపురేఖలు వేరట
ఊపిరొకటే చాలట
ఆ వారాన్నే స్నేహమంటున్నాం మనం!
కంటిపాపని కాపుకాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడ నివ్వాలీ!
స్నేహమంటే రూపులేనీ ఉహా కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలీ!

Tuesday, August 12, 2008

నే తొలిసారిగా - సంతొషం

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా!
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా!!

స్వప్నమా, నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా!
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా!
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా, స్నేహమా!

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా!
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా!!

రెక్కలు తొడిగిన తలపు నువే కదా నేస్తమా!
ఎక్కడ వాలను చెప్పు నువే సావాసమా!!
హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా!
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా !!
నడకలు నేర్పిన ఆశవు కదా,
తడబడనీయకు కదిలిన కధ,
వెతికే మనసుకు మమతే పంచుమా!

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా!
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా!!


ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా!
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా!!
నీ వొడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా!
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా!!
పెదవులపై చిరునవ్వుల దగా,
కనబడనియ్యవు నిప్పుల సెగ,
నీటికి ఆరని మంటల రూపమా!

నీ ఆటేమిటో ఏ నాటికీ ఆపవుకదా!
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవుకదా!!

తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమ!
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా!!
పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా!
పంతమా! బంధమా!!

నీ ఆటేమిటో ఏ నాటికీ ఆపవుకదా!
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవుకదా!!

Thursday, August 7, 2008

పగలే వెన్నెలా - పూజా ఫలం

పగలే వెన్నెలా, జగమే ఊయలా
కదలే ఊహలకే కన్నులుంటే

పగలే వెన్నెలా, జగమే ఊయలా

నిన్.గిలోన చందమామ తొంగి చూచే
నీటిలోన కాలువ భామా పొంగి పూచే

ఈ అనురాగమే జీవన రాగమై
ఈ అనురాగమే జీవన రాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా !

పగలే వెన్నెల, జగమే ఊయలా!

కడలి పిలువ కన్నెవాగు పరుగుదీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపే

ఈ అనుభంధమే మధురానందమై
ఈ అనుభంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల, జగమే ఊయలా..

నీలిమబ్బు నీడ లేచి నెమలి ఆడే
పూలఋతువు సైగ చూసి శికము(??) పాడే
నీలిమబ్బు నీడ లేచి (??) నెమలి ఆడే
పూలఋతువు సైగ చూసి శికము(??) పాడే
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెలా,జగమే ఊయలా
కదలే ఊహలకే కన్నులుంటే
పగలే వెన్నెల!

Watch the song here

మనసున మనసై - Dr. చక్రవర్తి

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!

ఆశలు తీరని ఆవేశములో,
ఆశయాలలో, ఆవేదనలో,
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!

నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!

చెలిమియే కరువై, వలపే అరుదై,
చెదిరిన హృదయమే, శిలయై పోగా
నీ వ్యథ తెలిసీ, నీడగ నిలిచే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!

Watch the song here

Tuesday, August 5, 2008

ప్రపంచమే కాదన్నా - భగీరధ

ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఓఒఓ-ఓఒఓ-ఓఒఓ!!

ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా!
అద్రుష్టమే లేకున్నా నీకష్టమే తనదన్నా
నీలో ఉండే ప్రాణం నేస్తంరా!
పాపలా నువ్వున్నచో తను కన్నురా!
పాదమై నువ్వున్నచో తను మన్నురా!
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా!
ఈ చొటనే కాదు స్వర్గాన నీ తోడురా!

ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఓఒఓ-ఓఒఓ-ఓఒఓ!!

ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా!

త్యాగాలే చేసేది, త్యాగాలే కోరేదీ,
త్యాగంలో బ్రతికేదీ, స్నేహమే!
లోపలే చూసేదీ, ఆ పై సరిచేసేది,
లాభాలే చూడనిదీ, స్నేహమే!

పంచే కొద్దీ మించిపోయే నిధీ,
తాగే కొద్దీ పొంగి పోయే నదీ,
పంచే కొద్దీ మించిపోయే నిధీ,
తాగే కొద్దీ పొంగి పోయే నదీ,
ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిదీ!
యుధ్ధాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహానిదీ!


ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఓఒఓ-ఓఒఓ-ఓఒఓ!!

ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా!

విశ్వాసమే తొలి మెట్టూ, విశ్వాసమే మలి మెట్టూ,
విశ్వాసమే చివరంటూ ఉన్నదీ!
ఆకాశమే హద్దైనా వినువీధే తనదైనా
ఈ భూమే నెలవంటూ అన్నదీ!

కాలం కన్నా ఇది విలువైనదీ,
సత్యం కన్నా ఇది నిజమైనదీ,
కాలం కన్నా ఇది విలువైనదీ,
సత్యం కన్నా ఇది నిజమైనదీ,
మనసున దాగిన మనసుని చూపే
ఆకృతి స్నేహానిదీ!
మనిషిని పూర్తిగ మనిషిగ మార్చే
సంస్కృతి స్నేహానిదీ!

లాలించగా అమ్మల్లే , పాలించగా నాన్నల్లే
లభించినా వారమే నేస్తంరా!
ఆడించగా అన్నల్లే, బొధించగా గురువల్లే
చలించనీ రుణమే నేస్తంరా!

పాపలా నువ్వున్నచో తను కన్నురా!
పాదమై నువ్వున్నచో తను మన్నురా!
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా!
ఈ చొటనే కాదు స్వర్గాన నీ తోడురా!

ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఒ ఒ ఓ! ఓఒఓ-ఓఒఓ-ఓఒఓ!!

తిరుమలవాస! - భద్ర

తిరుమలవాసా!
తిరుమలవాసా! సుమధరహాసా! ఈ హారతి గొనవయ్యా!
శ్రితజనపోసా! జయ జగదీశా! మా అరతిని గనవయ్య!

అడుగే పడని పయనానా..
అడుగే పడని పయనానా.. వెలుగై నడిపే నీ కరుణా!

ఆ వరాన్ని ఈ దోసిలి లొనా నిలుపుకొందుకే తపములు చేసా!
తిరుమలవాసా! సుమధరహాసా! ఈ హారతి గొనవయ్యా!
శ్రితజనపోసా! జయ జగదీశా! మా అరతిని గనవయ్య!

Friday, August 1, 2008

వెండి వెన్నెలా - Little Soldiers

ఓఒ ఓఒ ఓ.. వెండి వెన్నెలా
ఓఒ ఓఒ ఓ.. దిగిరా ఇలా
అమ్మ కొంగులో చంటిపాపలా
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతారని పసి పాదాలకే పరుగే నేర్పవా?
మదిలో దాగిన మధు భావాలకీ వెలుగే చూపవా?
మనసుంటే మార్గముంది తెంచుకోవె సంకెలా !

ఓఒ ఓఒ ఓ..సుప్రభాతమా
ఓఒ ఓఒ ఓ..శుభమంత్రమా
మేలుకొమ్మనే ప్రేమగీతమా
చేరుకున్న నా తొలి చైత్రమా
ఈ స్వరాలతో నా నరాలలో ఒక గంగా నది
ఈ క్షణాన నీ జత చేరాలనీ అలలౌతున్నదీ
వెల్లువలా చేరుకోవే వేచి ఉన్న సంద్రమా

అంత దూరమా స్వర్గమన్నదీ
చిటికెలో ఇలా మనదైనదీ
అందరానిదా స్వప్నమైనదీ
అందమైన ఈ నిజమైనదీ
చిరు హాసానికే మా సంసారమే చిరునామా అనీ
ఈ సంతొషమే మా సంతానమై చిగురించాలనీ
ప్రతిరోజు పండగల్లె సాగుతోంది జీవితం !!

అడగాలనుంది ఒక డౌటునీ - Little soldiers

అడగాలనుంది ఒక డౌటునీ
sun-rise లేని రొజేదనీ
మరి everyday ని sunday అనీ
అనకుంటే తప్పు కాదా అనీ
ఆది తెలిసీ పెద్దవాళ్ళు
ఎందువలనో ఒప్పుకోరు
పదమంటూ school కేసి
six days తరుముతారు

హయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
happy గా ఆడుకుంటాం అంటే వదలరే

అడగాలనుంది ఒక డౌటునీ
sun-rise లేని రొజేదనీ!!

ఈ height ఏ నాకు వుంటె
అమ్మో ఎంత Danger
నాక్కూడా మీసముంటే
ఎం చేస్తావు మజర్?

class miss chair లోన నేను కూరుచుంటా
comics class books చేసి చదివిస్తా
school కి prinicpal sir నేను ఔతా
All days holidays ఆడుకోండి అంటా,
exams ఓస్తె అప్పుడు ఎలా మరీ
మార్కులు కూడా మీరే వేస్తె సరీ!

హయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
happy గా ఆడుకుంటాం అంటే వదలరే

చాలమ్మా ఆటలింకా,
కొంచం అగు మమ్మీ!
రానంటే వెళ్ళిపోతా
No! No! ఒద్దు daddy!

అటకైన పాటకైన ఆఖరంటు లేదా
ఆకలైతే అప్పుడైన అమ్మ గుర్తురాదా
పిట్టలైన పొద్దు పోతె గూడు చేరుకోవా
పిల్లలైన పెద్దలైన రాత్రి నిద్దరోరా
night ఏ రానీ చోటే చూస్తే సరీ
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరీ !!

ఎంచక్కా నిద్దరోయీ కలలో జారూకో
ఆకాలతో నువ్వు కోరే చోటే చేరుకో

అడగాలనుంది ఒక డౌటునీ
sun-rise లేని రొజేదనీ
మరి everyday ని sunday అనీ
అనకుంటే తప్పు కాదా అనీ
ఆది తెలిసీ పెద్దవాళ్ళు
ఎందువలనో ఒప్పుకోరు
పదమంటూ school కేసి
six days తరుముతారు

హయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే
happy గా ఆడుకుంటాం అంటే వదలరే!!

కొలిచి నందుకు - సూత్రధారులు

అయ్యా.. రామయ్యా
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కోటి దివ్వెలపాటి కొడుకూవైనావా
తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండీ కొండల సాటి తండ్రివైనావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలొ ఒదిగిన ఓరయ్యా
బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా, బతుకు పండగా
కలల పంటగా, బతుకు పండగా
కళ్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
సాకేత రాముడిలా సాగిపోవయ్యా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చండాడినాడోయ్
యాదవును కాపాడినాడోయ్
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
మిథిలకు వచ్చీ, రామయ్యా రాముడు
శివునివిల్లు విరిచీ, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతారాముడు అయ్యేదెపుడో

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా