Thursday, August 14, 2008

ఎవరో ఒకరు - అంకురం

ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ !

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

కదలరు ఎవ్వరూ వేకువ వొచ్చినా
అనుకోని కోడి కూత నిదరపోదుగా!
జగతికి మేలుకొల్పు మానుకోదుగా!!
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే,
మబ్బు పొంగు చాటుగా వొదిగి దాగితే
వాన ధార
రాదుగా నెల దారికీ,
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ !!

ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ!
దానికి లెక్క లేదు కాళరాతిరీ!
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని!
రెప్ప వెనక ఆపనీ కంటి నీటినీ !
సాగలేక ఆగితే దారి తరుగు
నా?
జాలి చూపి తీరమే
దరికి చేరునా?

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా!
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా!
ఎంత వేడి ఎండతో వొళ్ళు మండితే
అంత వాడి అవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళు మూయడా?
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా?

ఎవరో ఒకరూ ఎపు
డోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!!

Listen to the song here!

No comments: