మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
ఆశలు తీరని ఆవేశములో,
ఆశయాలలో, ఆవేదనలో,
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
చెలిమియే కరువై, వలపే అరుదై,
చెదిరిన హృదయమే, శిలయై పోగా
నీ వ్యథ తెలిసీ, నీడగ నిలిచే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
Watch the song here
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
ఆశలు తీరని ఆవేశములో,
ఆశయాలలో, ఆవేదనలో,
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ
నీకోసమే కన్నీరునించుటకూ
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గమూ!
చెలిమియే కరువై, వలపే అరుదై,
చెదిరిన హృదయమే, శిలయై పోగా
నీ వ్యథ తెలిసీ, నీడగ నిలిచే
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన, అదే భాగ్యమూ,అదే స్వర్గము!
Watch the song here
No comments:
Post a Comment