Tuesday, September 30, 2008

ఓ మనసా - భద్ర

మనసా! మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!

చెలియ గుండె తాకలేకా పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా!

మనసా! మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!

ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడీ ఎం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో
మిగిలే స్మృతులే మరవదు మనసా !

మనసా! మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!

తన ఒడిలో పొదువుకొనీ భద్రంగా నడిపే నౌక
తననొదిలీ వెళ్ళకనీ బంధాన్నీ కోరదుగా
కడలి లోనే ఆగుతుందా కదలనంటూ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా!

Friday, September 19, 2008

గోవుల్లు తెల్లనా - సప్తపది

గోవుల్లు తెల్లనా
గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా
ఎందువలనా?

గోవుల్లు తెల్లనా
గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా
ఎందువలనా?

గోధూళి ఎర్రనా
ఎందువలనా?

తెల్లావు కడుపులో కర్రావులుండవా!
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా!!
తెల్లావు కడుపులో కర్రావులుండవా!
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా!!

గోపయ్య ఆడున్నా
గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై
గోపెమ్మ కంటదా!
పొద్దు పొడిచేనా
పొద్దు గడిచేనా
ఎందువలనా అంటే అందువలనా !
ఎందువలనా అంటే దైవఘటనా!

గోవుల్లు తెల్లనా
గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా
ఎందువలనా?

పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలు
అల్లన మోవికీ తాకితే గేయాలూ!
పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలు
అల్లన మోవికీ తాకితే గేయాలూ!

మురళి మూగైనా
పెదవి మోడైనా
గుండె గొంతులో
పాట నిండదా!

కడిమీ పూసేనా
కలిమీ చూసేనా

ఎందువలనా అంటే అందువలనా !
ఎందువలనా అంటే దైవఘటనా!

గోవుల్లు తెల్లనా
గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా
ఎందువలనా?

గోధూళి ఎర్రనా
ఎందువలనా?

లలాల లాలలా లాలలాలలా!

కలనైనా - చుక్కల్లో చంద్రుడు

కలనైనా.. ఇలనైనా..
నువు లేకా క్షణమైనా
కదలదు కాస్తైన కాలమూ
దొరికెను వరమల్లె నీ స్నేహమూ
ప్రియా ప్రియా నువ్వే లోకమూ
నాలో సగం జగం..

కలనైనా ఇలనైనా
సప పద పామ పద పామ గారి
......(yet to write)

మనసుపడే స్నేహమా
చెప్పవే ప్రేమ సాగరమా
ఎగిసిపడే కెరటానికీ
తీరమై చేరనా
విరహపడే గగనమా
మేఘమై వీడి వెళ్ళకుమా
చిలికిపడే చినుకునీ
సంద్రమై దాచనా

సమయం ప్రణయం నను ఏదో ఏదో చేసే
తరుణం నా హృదయం చెలి నిన్నే నిన్నే కోరే
ఇది ఎంతటి అతిశయమో
ప్రియ ఆశై శ్వాసై ధ్యాసై ఉసై
ఉంటా ప్రతిక్షణమూ!

కలిగెనులే సందేహమూ నేనే నేను కదా అనీ
తెలిసెనులే సత్యమూ నాలో నువ్వు చేరావనీ
గడవదులే నిముషమూ
ఇది ప్రేమో మాయో ఏమో!
కలవరమై నా కళ్ళలో
ఏవో కొంటె స్వప్నాలలో

గ్రహణాలే తొలగిస్తూ గగనాలే దాటొస్తా
చిరు మబ్బుల మీదుగ పగడపు దీవికి
రెక్కల గుర్రం మీదన వచ్చీ
నీకలలన్నీ తీర్చే రాజుని నేనే నేనౌతా!

కలనైనా..కలనైనా..
ఇలనైనా.. ఇలనైనా..

Saturday, September 13, 2008

ఏ కులమూ నీదంటే - సప్తపది

కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ !
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మందీ !!

కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ !
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మందీ !!

ఏడు వర్ణాలు కలిసీ ఇంధ్రధనసౌతాదీ
అన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాదీ !

ఏడు వర్ణాలు కలిసీ ఇంధ్రధనసౌతాదీ
అన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాదీ !!

కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ !
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మందీ !!

ఆది నుంచి ఆకాశం మూగదీ
అనాదిగా తల్లి ధరణి మూగదీ !!
ఆది నుంచి ఆకాశం మూగదీ
అనాదిగా తల్లి ధరణి మూగదీ !!
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు!!

కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ !
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మందీ !!