ఓ మనసా! ఓ మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
చెలియ గుండె తాకలేకా పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా!
ఓ మనసా! ఓ మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడీ ఎం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో
మిగిలే స్మృతులే మరవదు ఓ మనసా !
ఓ మనసా! ఓ మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
తన ఒడిలో పొదువుకొనీ భద్రంగా నడిపే నౌక
తననొదిలీ వెళ్ళకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలి లోనే ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలలే తరిమే ఓ మనసా!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
చెలియ గుండె తాకలేకా పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా!
ఓ మనసా! ఓ మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడీ ఎం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో
మిగిలే స్మృతులే మరవదు ఓ మనసా !
ఓ మనసా! ఓ మనసా! చెబితే వినవా నువ్వు!
నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు!!
తన ఒడిలో పొదువుకొనీ భద్రంగా నడిపే నౌక
తననొదిలీ వెళ్ళకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలి లోనే ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలలే తరిమే ఓ మనసా!
No comments:
Post a Comment