Wednesday, December 17, 2008

చిటపట చినుకులు - ఐతే

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే, ఐతే!
తరగని సిరూలతో తలరాతలనే మార్చేస్తుంటే, ఇట్టె ఇట్టే!

అడ్డు చెప్పదే umbrella ఎపుడూ,
వానా! నువ్వొస్తానంటే!
నిధులకు తలుపులు తెరవగ మనకొక అలీ బాబా ఉంటే!
అడిగిన తఱుణమే పరుగులు తేసే అల్లా-ఉద్దీన్ జీని ఉంటే!
చూపదా మరి మాయా దీపం,
మన fate యే flight అయ్యే runway!

నడిరాత్రే వస్తావెం స్వప్నమా?
పగలంతా ఎం చేస్తావ్ మిత్రమా!
ఊరికినే ఊరిస్తే న్యాయమా?
సరదాగా నిజమైతే నష్టమా!
మొనాలీసా మొహం మీదే నిలుస్తావా,
చిరునవ్వా? .. ఇలా రావా!

...

వేకువనే మురిపించే ఆశలు..
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకంలో లేవా రంగులు?
నలుపొకటే చూపాలా కన్నులూ!
ఇలాగేనా ప్రతీ రోజూ ఏలాగైన
ఏదో రోజూ.. మనదై రాదా!!

...

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే, ఐతే!
తరగని సిరూలతో తలరాతలనే మార్చేస్తుంటే, ఇట్టె ఇట్టే!

Thursday, December 11, 2008

జీవము నీవే కదా - భక్త ప్రహ్లాద

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
నా భారము నీవే కదా!

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..
స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!

నిన్నేగానీ పరులనెఱుంగా
రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!

హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ
దీ శరణ్యా
కరుణాభరణా.. కమలలోచ
నా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా!

లక్ష్మీ వల్లభా
లక్ష్మీ వల్లభా!

Monday, December 8, 2008

వేషము మార్చెను - గుండమ్మ కధ

వేషము మార్చెనూ, భాషను మార్చెనూ
మోసము నేర్చెనూ, అసలు తానే మారెనూ

ఐనా.. మనిషి మారలేదు.. ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు.. ఆతని మమత తీరలేదు

కౄర మృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
కౄర మృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జెండా పాతెనూ
హిమాలయముపై జెండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను

ఐనా.. మనిషి మారలేదూ.. ఆతని కాంక్ష తీరలేదు

పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమె మేలని బోధలు చేసెను

ఐనా.. మనిషి మారలేదు.. ఆతని బాధ తీరలేదు

వేషమూ మార్చెనూ, భాషనూ మార్చెనూ
మోసము నేర్చెను, తలలే మార్చెను
ఐనా.. మనిషి మారలేదూ.. ఆతని మమత తీరలేదు!!

Listen to the song here (Manishi Maraledu)