ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం,
ఆది ఏదో చెప్పలేనంది ఏ వైనం!
కలత పడుతోందే లోలోనా కసురుకుంటోందే నా పైనా
తన గుబులు నేనో, నా దిగులు తానో
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
ఆది ఏదో చెప్పలేనంది ఏ వైనం!
పచ్చగా ఉన్న పూతోట నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా!
పచ్చగా ఉన్న పూతోట నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా!
ఉండలేను నెమ్మదిగా, ఎందుకంట తెలియదుగా!
ఉండలేను నెమ్మదిగా, ఎందుకంట తెలియదుగా!
తప్పటడుగో తప్పు అనుకో, తప్పదే తప్పుకుపోదాం..
తక్షణం.. ఎంతో పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం!

No comments:
Post a Comment