ఆది భిక్షువు వాడినేది కోరేదీ?
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ?
ఆది భిక్షువు వాడినేది కోరేదీ?
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ?
ఏది కోరేది? వాడినేది అడిగేదీ?
ఏది కోరేది? వాడినేది అడిగేదీ?
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేదీ?
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేదీ?
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?
తేనెలొలికే పూల బాలలకు ముణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేదీ?
తేనెలొలికే పూల బాలలకు ముణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేదీ?
బండ రాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు !
వాడినేది కోరేదీ?
వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేదీ?
ముఖప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు!
వాడినేది కోరేదీ?
ముక్కంటి, ముక్కోపి !
ముక్కంటి, ముక్కోపి , తిక్క శంకరుడూ!

No comments:
Post a Comment