Tuesday, May 12, 2009

ఎన్నో ఎన్నో - Kavya's Diary

ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో, సంతోషాలెన్నో!
నిన్న మొన్నా నాతో ఉన్న, ఉల్లాసాలెన్నో!
బలమైన జ్ఞాపకాలే బతుకంత నాకు తోడై ఉండే బంధాలెన్నో!

ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో,సంతోషాలెన్నో!

చిలిపిదనంతో చెలిమి ఎదల్లో దోచిన విరులెన్నో!
చురుకుదనంతో చదువుల ఒళ్ళో గెలిచిన సిరులెన్నో!
అందాల అల్లార్లే ఇంకా గుర్తు ఉన్నవీ,
నాటి వెన్నెలలే నన్నే పట్టి ఉన్నవీ!
మళ్ళి కాలాలే రావాలీ
అంటూ నా కన్నుల్లో కలలెన్నో!

ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో, సంతోషాలెన్నెన్నో!

నవ్వులకైనా నవ్వులు తుళ్ళే నిమిషాలెన్నెన్నో
శ్వాసలలోనా ఆశలు రేపే సమయాలింకెన్నో!
బంగారు జింకల్లే చిందే ఈడులే అదీ!
ముత్యాలా మబ్బల్లే కురిసే హాయిలే ఇదీ!
చెదరదులే స్వప్నం రోజూ
చేరగదులే సత్యం రోజూ!

ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో,సంతోషాలెన్నో!
నిన్న మొన్నా నాతో ఉన్న, ఉల్లాసాలెన్నో!
బలమైన జ్ఞాపకాలే బతుకంత నాకు తోడై ఉండే బంధాలెన్నో

ఎన్నో ఎన్నో, ఎన్నో ఎన్నో, సంతోషాలెన్నెన్నో!

No comments: