Thursday, July 15, 2010

నవ్వే నవ్వే నవ్వే - వేడుక

నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే

ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి తడి కన్నీరైన క్షణాన్నడుగు నువ్వే!

నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే

తారేరె ...

నింగి నవ్వు చినుకే , చినుకు
పడి నేల నవ్వు మొలకే!
కంటి నవ్వు కలలే, కలలుగనె కన్నె నవ్వు కబురే !
నీ కబురొచ్చాకే పాదం నవ్విందీ,
అది పరుగులు తీసి దగ్గరికొస్తే దూరం నవ్విందీ!
నీ పరమైనందుకు పరువం నవ్వింది, ప్రేయసి పదవే నాదే నందుకు గర్వం నవ్విందీ!

పదం వింటూ నీ ఎదల్లోకి నా పెదాలొచ్చి నవ్వే!

నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే

దాగి ఉన్న మనసే ఎగసెగసి మూగ నవ్వు కొసరే!
వేగుతున్న వయసే, తెగ విసిగి వేడి నవ్వు విసిరే
మన తొందర చూసి సరసం నవ్విందీ!
ఇక ఇద్దరినొదిలీ వెళ్ళొస్తానని విరహం ఏడ్చిందీ!
నీ సందిట చేరీ సమయం నవ్విందీ,
ఇక ఇద్దరి మధ్యన చోటే లేదని సిగ్గే ఏడ్చిందీ!

ఆ బాధల్లోన ఈ నవ్వుల్లోన జత పడే బ్రతుకు నవ్వే!

నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే

ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి తడి కన్నీరైన క్షణాన్నడుగు నువ్వే!

Thursday, February 25, 2010

ఉఱుములు నీ మువ్వాలై - చంద్రలేఖ

ఉఱుములు నీ మువ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా అలివేణి!
పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై,
చిలిపిగ చిందాడవే, కిన్నెరసాని!
కాలానికే గాలాడకా ఆగలి నువ్వూ ఆడేవేళా!
అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగీ నేలా!

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ!
మెలికల మందాకినీ, కులుకుల బృందావనీ,
కనులకు విందియ్యవే, నా అందాన్నీ!

చంద్రుళ్ళో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసిందీ ముంగిలీ!
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూటా దీపావళీ!
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెలా!
మా ఆశలే నీ అందెలై మంచు మౌనం మోగేవేళా!
సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడేవేళా??!

ఉఱుములు నీ ము
వ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా కళ్యాణి!
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ!

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ పుడమే పులకించగా!
నీ పెదవే తన కోసం అణువైన కొలువంటూ సంగీతం నిను చేరగా!
మా గుండెనే శ్రుతిచేయవా నీ వీణలా!

గాలిలో నీ కేళితో?? రాగాలు ఎన్నో రేగే వేళా!
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగేవేళా!

ఉఱుములు నీ ము
వ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా అలివేణి!

తకధిమి తాళాలపై, తళుకుల తరంగమై,
చిలిపిగ చిందాడవే, కిన్నెరసానీ!

Friday, February 19, 2010

భం భం భోలే! - ఇంద్ర

భం భం భోలే శంఖం మోగెలే!
ఢం ఢం ఢోలే చలరేగిందిలే!!
భం భం భోలే శంఖం మోగెలే!
ఢం ఢం ఢోలే చలరేగిందిలే!!
తధ్ధినకధిన్ దరువై సందడి రేగనీ!
పొద్దులెరుగని పరుగై ముందుకు సానీ!!
తధ్ధినకధిన్ దరువై సందడి రేగనీ!
పొద్దులెరుగని పరుగై ముందుకు సానీ!!
విలాసంగా శివానందలహరీ!
మహాగంగ ప్రవాహంగా మారీ,
విశాలాక్షి సమేతంగా చేరీ,
వరాలిచ్చే కాశీపురీ!

భం భం భోలే శంఖం మోగెలే!
ఢం ఢం ఢోలే చలరేగిందిలే!!
తధ్ధినకధిన్ దరువై సందడి రేగనీ!
పొద్దులెరుగని పరుగై ముందుకు సానీ!!
విలాసంగా శివానందలహరీ!
మహాగంగ ప్రవాహంగా మారీ,
విశాలాక్షి సమేతంగా చేరీ,
వరాలిచ్చే కాశీపురీ!

భం భం భోలే భం భం భోలే భోలెనాధ్!
భం భం భోలే భం భం భోలే భోలెనాధ్!
భోలే నాచే చమక్ చమాచమ్
భోలే నాచే చమక్ చమాచమ్
ఢమఱు భాజే ఢమఱు భాజే ఢమఱు భాజే ఢం ఢమాఢం!
భోలే నాచే చమక్ చమాచమ్
భోలే నాచే చమక్ చమాచమ్

వారణాశిని వర్ణించే నా గీతికా!
నాటి శ్రీనాధుని కవితే వినిపించగా!!
ముక్తికై మార్గం చూపే మణికర్ణిక
అల్లదే అందినాయి చిరుఘంటిక!!

ఢమక ఢమకాలై ఎద లయలే కీర్తన చేయగా!
యమక గమకాలై పదగతులే నార్తన చేయగా!!
ప్రతీ అడుగూ తరిస్తుందీ ప్రదక్షిణగా !!
విలాసంగా శివానంద లహరి!
మహగంగ ప్రవాహంగా మారీ,
విశాలాక్షీ సమేతంగా చేరీ,
వరాలిచ్చే కాసీపురీ!!
కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా!
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా!

ఎదురయే శిలయే అయినా శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే!!
చిరంజీవిగా నిలిచిందీ నగరమే!
చరితలకు అందనిదీ కైలాసమే!!

గాలిలో నిత్యం వినలేదా ఓంకారమే!
గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే!!
తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా!

విలాసంగా శివానంద లహరి!
మహాగంగ ప్రవాహంగా మారీ,
విశాలాక్షి సమేతంగా చేరీ,
వరాలిచ్చే కాశీపూరీ!!
భం భం భోలే శంఖం మోగెలే
ఢం ఢం ఢోలే చలరేగిందిలే
తధ్ధినకధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగానీ!
తధ్ధినకధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగానీ!
విలాసంగా శివానంద లహరి!
మహాగంగ ప్రవాహంగా మారీ,
విశాలాక్షి సమేతంగా చేరీ,
వరాలిచ్చే కాశీపూరీ!!