Thursday, February 25, 2010

ఉఱుములు నీ మువ్వాలై - చంద్రలేఖ

ఉఱుములు నీ మువ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా అలివేణి!
పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై,
చిలిపిగ చిందాడవే, కిన్నెరసాని!
కాలానికే గాలాడకా ఆగలి నువ్వూ ఆడేవేళా!
అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగీ నేలా!

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ!
మెలికల మందాకినీ, కులుకుల బృందావనీ,
కనులకు విందియ్యవే, నా అందాన్నీ!

చంద్రుళ్ళో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసిందీ ముంగిలీ!
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూటా దీపావళీ!
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెలా!
మా ఆశలే నీ అందెలై మంచు మౌనం మోగేవేళా!
సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడేవేళా??!

ఉఱుములు నీ ము
వ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా కళ్యాణి!
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ!

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ పుడమే పులకించగా!
నీ పెదవే తన కోసం అణువైన కొలువంటూ సంగీతం నిను చేరగా!
మా గుండెనే శ్రుతిచేయవా నీ వీణలా!

గాలిలో నీ కేళితో?? రాగాలు ఎన్నో రేగే వేళా!
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగేవేళా!

ఉఱుములు నీ ము
వ్వులై, మెఱుపులు నీ నవ్వులై,
తొలకరి మేఘానివై, రా అలివేణి!

తకధిమి తాళాలపై, తళుకుల తరంగమై,
చిలిపిగ చిందాడవే, కిన్నెరసానీ!

2 comments:

Unknown said...

చాలా మంచి పాట... :)

Unknown said...

చాలా మంచి పాట... :)