Tuesday, August 19, 2008

ఏ చోట ఉన్నా - నువ్వే నువ్వే

చోట ఉన్నా (ఉన్నా), నీ వెంట లెనా(లెనా)?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే

రేపులేని చూపు నేనై, శ్వాసలేనీ ఆశ నేనై మిగలనా, ..!
నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతీ క్షణం నా మౌనం!!

చోట ఉన్నా, నీ వెంట లెనా?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే

నేల వైపు చూసీ నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ?
గాలి వెంట వెళ్లే మారం మానుకొమ్మనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వునీ?
ఏమంత పాపం ప్రెమా ప్రేమించడం?
ఇకనైనా చాలించమ్మా వేధించడం!
చెలిమై కురిసే సిరి వెన్నెలవా క్షణమై కరిగే కలవా, ..!

నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతి క్షణం నా మౌనం!!
రేపులేని చూపు నేనై, శ్వాసలేనీ ఆశ నేనై మిగలనా, ..!

వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరెదెలా?
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా?
నాక్కూడ చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ జన్మలో?
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వేలుగై రావా, !
నువ్వే నువ్వే కావాలంటుందీ పదే పదే నా ప్రాణం!
నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతి క్షణం నా మౌనం!!

చోట ఉన్నా, నీ వెంట లెనా?
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే!

Watch the song here!

No comments: